logo

ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు

అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్‌ ఏకపక్షంగా నడిపిస్తున్నారు.

Published : 26 Apr 2024 06:11 IST

తొలిసారిగా ప్రచారం చేపట్టిన తెదేపా
పట్టు నిలుపుకొనేలా అడుగులు

లింగంబోడులో పర్యటిస్తున్న కాటసాని చంద్రశేఖరరెడ్డి

అవుకు, న్యూస్‌టుడే: అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్‌ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. ఈసారి దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని తెదేపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది...తెదేపా నేతలు తొలిసారిగా అక్కడ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. గుండ్లశింగవరం గ్రామానికి చెందిన కాటసాని చంద్రశేఖరరెడ్డి వైకాపాను వీడి తెదేపాలోకి చేరారు. ఆయన ముందుండి ప్రచారం చేస్తున్నారు. అవుకు మండలం జూనూతల, కొండమనాయునిపల్లె గ్రామాల్లో ‘చల్లా’ కుటుంబానికి పట్టుది. ఆయా గ్రామాల్లోప్రతిపక్షపార్టీ తరపున చల్లా రామక్రిష్ణారెడ్డి సోదరుడు చల్లా విజయభాస్కరరెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. మొన్నటి వరకు వైకాపాలో కొనసాగిన ఆయన గత నెలలో ఆ పార్టీని వీడి తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో చేరడంతో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు