logo

టీజీ భరత్‌ నామినేషన్‌ దాఖలు

కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 26 Apr 2024 06:04 IST

ఆర్వో, నగరపాలక కమిషనర్‌ భార్గవ్‌తేజకు నామపత్రాలు అందజేస్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌, పక్కన సోమిశెట్టి, ఇక్బాల్‌

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ తమ నామపత్రాలను నియోజకవర్గ ఆర్వో, నగరపాలక కమిషనర్‌ భార్గవ్‌తేజకు అందజేశారు. అంతకుముందు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

ప్రజల ఆశీర్వాదం మరిచిపోలేనిది

నామినేషన్‌ వేసిన అనంతరం టీజీ భరత్‌ మాట్లాడుతూ తనను ఆశీర్వదించేందుకు ప్రజలు భారీగా తరలిరావడం ఆనందంగా ఉందని, రానున్న ఎన్నికల్లో విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సూపర్‌-6 పథకాలతోపాటు తన ఆరు గ్యారంటీలను అమలుచేసి నగర ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీజీ భరత్‌ 30 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా నేత ఇక్బాల్‌ మాట్లాడుతూ తెదేపాతోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, భాజపా, లోక్‌సత్తా, ఎమ్మార్పీఎస్‌ నాయకులు అర్షద్‌, సూర్యప్రకాశ్‌, బ్రహ్మేశ్వర్‌రెడ్డి, రెడ్డిపోగు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు