logo

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు.

Published : 23 Apr 2024 03:12 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తితో సమావేశమైన బీద రవిచంద్రయాదవ్‌, వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ తదితరులతో సోమవారం సమావేశమై చర్చించారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రచారానికి ఇరవై రోజుల సమయం ఉండటంతో నిత్యం జనంలో ఉంటూ వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఏయే వర్గాలు ఏమేరకు నష్టపోయాయో ప్రజలకు వివరించాలని.. ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరాలని చెప్పారు.

తెదేపా కార్యాలయంలో సమావేశమైన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్‌, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తదితరులు

కేఈ కృష్ణమూర్తితో సమావేశం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, జోన్‌-5 కోఆర్డినేటర్‌ బీద రవిచంద్ర యాదవ్‌, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తదితరులు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తిని సోమవారం కర్నూలులోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని