logo

నిర్వహణ లోపాలు.. వెలగని దీపాలు

నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా..

Published : 06 May 2024 03:30 IST

ఈనాడు, కర్నూలు, నంద్యాల బొమ్మలసత్రం: నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చీకట్లే దర్శనమిస్తున్నాయి. పురాల్లో ప్రధాన రోడ్లు, కూడళ్లు, పైవంతెనలపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదు. మరమ్మతుకు గురైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన దారులు చీకటిమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు.

టెక్కెవైపు కన్నెత్తి చూడరు: నంద్యాలలోని టెక్కె సమీపంలో విద్యుత్తు స్తంభానికి ఉన్న వీధి దీపాలు మరమ్మతుకు గురయ్యాయి. కొత్తవి ఏర్పాటు చేయాల్సిన పురపాలక సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పట్టణవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అలంకరారప్రాయమే..: నంద్యాలలోని నూనెపల్లె పైవంతనపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఉన్నా.. వెలగవు. ఈ దారిలో వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని