logo

లారీ ఢీకొని చిరుద్యోగి దుర్మరణం

ఉదయమే విధులకు బయలుదేరిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కుషాయిగూడ ఎస్‌ఐ నాగుల ఉపేందర్‌ కథనం ప్రకారం..  

Published : 24 Mar 2023 05:07 IST

విధులకు వెళ్తుండగా ప్రమాదం

బిజ్జు రాజు

కాప్రా, న్యూస్‌టుడే : ఉదయమే విధులకు బయలుదేరిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కుషాయిగూడ ఎస్‌ఐ నాగుల ఉపేందర్‌ కథనం ప్రకారం..  వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన బిజ్జ రాజు (30) పదో తరగతి చదువుకున్నాడు. జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి నేరేడ్‌మెట్‌లోని గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య మంజుల, అయిదేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌ ఉన్నారు. ఏడాదిగా నాగారంలో పెద్దారెడ్డి స్వీట్‌ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఇంటి నుంచి దుకాణానికి బైక్‌పై బయలు దేరాడు. ఈసీఐఎల్‌ నుంచి నాగారం రేడియల్‌ రోడ్డుపై వెళ్తూ.. నాగార్జునగర్‌ కాలనీకి వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ  ఢీట్టింది. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. హెల్మెట్‌ ఉన్నా ప్రాణాలు దక్కలేదు. లారీ ఆగకుండా వెళ్లిపోయింది. కీసర మార్గంలో రోడ్డు పక్కన ఆపి డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు గుర్తించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని