logo

మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి

తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 03:27 IST

మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో మల్లు రవి, సంపత్‌కుమార్‌ తదితరులు

అలంపూర్‌, న్యూస్‌టుడే: తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్‌ ఆలయాల దర్శనం అనంతరం గాంధీ చౌక్‌లో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ఆర్‌.ఎస్‌ ప్రసన్న కుమార్‌లతో కలసి ప్రచారం నిర్వహించారు. సోనియా గాంధీ దయ వల్లే మనకు తెలంగాణ వచ్చిందని, అందుకే ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కే ఉందని మంత్రి పేర్కొన్నారు. అలంపూర్‌ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని, మే 31 తరువాత రెండు పడక గదుల నిర్మాణాలు మొదలు పెడతామని పేర్కొన్నారు. అలంపూర్‌లో డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయిస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్‌ రాదు, పింఛన్లు రావు, ఉద్యోగాలు రావని శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రచారం చేశారని, ప్రస్తుతం అవన్నీ ఇస్తూ మహిళాలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌, రూ.500 గ్యాస్‌ ఇస్తున్నట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కేసీఆర్‌ను దొంగదొంగ అన్న ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ నేడు ఆయన పక్షాన చేరి పోటీలో నిలిచారని, అలాంటి వ్యక్తి ఓట్లు వేస్తే ప్రయోజనం ఉండదన్నారు. మతం పేరుతో భాజపా విడదీసే కార్యక్రమం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు తప్పని సరిగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందు కార్యకర్తల సమావేశంలో మంత్రి జూపల్లి విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దిలేటి, ఇస్మాయిల్‌, మహేశ్వర్‌గౌడ్‌, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని