logo

బీసీ గురుకులం @ 92.05 శాతం

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు.

Updated : 26 Apr 2024 06:44 IST

ఇంటర్‌ ప్రథమలో 78.28 శాతం ఉత్తీర్ణత

ఉయ్యాలవాడ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో 994 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 915 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 79 మంది పరీక్ష తప్పారు. ఇంటర్‌ రెండో సంవత్సరంలో విద్యార్థులు 92.05 శాతం ఉత్తీర్ణతతో ప్రతిభను చాటారు. ప్రథమ సంవత్సరంలో 1,415 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,090 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ ప్రథమ విద్యార్థులు 78.28 శాతం ఉత్తీర్ణతను సాధించారు. వనపర్తి జిల్లా చిట్యాల బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో అన్ని గ్రూపుల్లో టాపర్లుగా నిలిచారని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వెంకట్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని