logo

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్‌ అధికారి బాలకృష్ణ తెలిపారు.

Published : 28 Mar 2024 04:00 IST

నారాయణపేట, న్యూస్‌టుడే : వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్‌ అధికారి బాలకృష్ణ తెలిపారు. మక్తల్‌ మండలం భూత్పూరు గ్రామానికి చెందిన నరసింహ, భార్య నర్సమ్మ ఇద్దరూ 2020 అక్టోబరు 26న రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయారు. తెల్లవారుజామున నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు. భర్త భార్య కనిపించడంలేదని అప్పట్లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసునమోదైంది. విచారణలో భాగంగా నర్సమ్మ తల్లి భీములమ్మను విచారించగా నరసింహ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, రెండు నెలలు మంచిగా సంసారం చేశారని,  భర్త, అత్తమామలు రూ.2లక్షల వరకట్నం, అయిదు తులాల బంగారం తీసుకురావాలని వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది. గ్రామస్థుల సమక్షంలో సర్దిచెప్పి దసరా పండగకు ఇస్తామని తెలిపినప్పటికీ వేధింపులు భరించలేక భూత్పూరు రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్మకు పాల్పడినట్లు అప్పట్లో పోలీసులకు వివరాలు వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు కేసును పరిశోధించి 16 మంది సాక్షులను విచారించి కోర్టులో ఛార్జిషీటు దాఖలుచేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలప్ప సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం నిరూపణ కావడంతో శిక్ష విధించిందన్నారు. శిక్షపడటంలో కృషిచేసిన అధికారులు, సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఎస్పీ యోగేశ్‌గౌతం అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని