logo

మన్యంకొండలో పూర్ణాహుతి

మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో...

Published : 28 Mar 2024 04:32 IST

వసంతోత్సవంలో శ్రీనివాస సమేత అలమేలుమంగ ఉత్సవ మూర్తులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్‌ చేతుల మీదుగా పూర్ణాహుతి, హోమంతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారి గర్భాలయానికి ఎదురుగా అలమేలుమంగ, శ్రీనివాసుల చక్రపూజ జరిపించారు. తరువాత వసంతోత్సవంలో భాగంగా అలమేలుమంగ, శ్రీనివాసులను బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలతో పొదిగిన వజ్రవైఢుర్యాలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి బ్రహË్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం చుట్టు ప్రదక్షిణలు గావించారు. సాయంత్రం అలిమేలుమంగ ఆలయం నుంచి స్వామివారి చక్రాన్ని పల్లకీలో పెట్టుకొని ఘాట్‌రోడ్ల వెంట కోనేరుకు చేరుకొని వేద పండితులు, అర్చకుల వేదమంత్రాలతో స్వామివారి చక్రస్నానం గావించారు. ఈ ప్రక్రియతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదికి ముగిశాయి. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు, పర్యవేక్షణాధికారి నిత్యానందచారి, దేవస్థాన పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కోనేరులో చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని