logo

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు

లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లతో పాటు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్‌(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

Published : 05 May 2024 02:18 IST

చారకొండ :జూపల్లిలో ఇంటివద్ద ఓటేస్తున్న వృద్ధురాలు సాయిలమ్మ

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లతో పాటు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్‌(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు అర్హులైన వారి నుంచి ఫారం - 12డి ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మొత్తం 1,026 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వనపర్తి, ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అత్యంత తక్కువగా మక్తల్‌, అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్నారు. తగిన స్థాయిలో అవగాహన కల్పించకపోవటమే తక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. హోం ఓటింగ్‌ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమైంది. 8వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ఎన్నికల సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికే వచ్చి అధికారుల పర్యవేక్షణలో ఓటు వేయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని