logo

మహనీయుల త్యాగాలు స్మరించుకుందాం

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోనే నిత్యావసర ధరలు రెండింతలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు.

Published : 12 Aug 2022 01:08 IST

మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

పాదయాత్రలో దామోదర రాజనర్సింహ, నాయకులు

మునిపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోనే నిత్యావసర ధరలు రెండింతలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భాగంగా నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల పాదయాత్రను  గురువారం మునిపల్లి మండలం బుధేరా కూడలి నుంచి ప్రారంభించి మునిపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పాదయాత్ర చేపట్టామన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుని, వారి స్ఫూర్తితో స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యంగ పరిరక్షణకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. మునిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపడుతున్న వీఆర్‌ఏలను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద గాంధీ, మునిపల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సతీష్‌కుమార్‌, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ అసద్‌పటేల్‌, ఎంపీటీసీ సభ్యులు పాండు, విజయ, నాయకులు సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌ గౌసోద్దీన్‌, బాలకృష్ణజోషి, నగేష్‌ యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని