logo

బీసీ బిడ్డను ఆశీర్వదించండి

అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్‌పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు.

Published : 26 Apr 2024 01:37 IST

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు

వెల్దుర్తిలో మాట్లాడుతున్న నీలం మధు, వేదికపై మదన్‌రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు

కౌడిపల్లి, వెల్దుర్తి, న్యూస్‌టుడే: అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్‌పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఐదు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన పేద బిడ్డను, కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరింది సంపాదన కోసం కాదని.. పెండింగ్‌ సమస్యలను తీర్చడానికని అన్నారు. గతంలో భారాసలో 80 మంది ఎమ్మెల్యేలు ఉండగానే మరో 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నీలం మధుకు గ్రామగ్రామాన మంచి ఆదరణ ఉందని గుర్తుచేశారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రావు, నాయకులు శేషసాయిరెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామంతాపూర్‌ దర్గాలో నీలం మధు ప్రార్థనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని