logo

పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు

Published : 08 May 2024 02:59 IST

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు. మండలంలోని రంగాయపల్లి, చెట్లగౌరారం, దండుపల్లి మీదుగా కాళ్లకల్‌ వరకు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కాళ్లకల్‌లో కార్నర్‌ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు మాట్లాడారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన స్థానం నుంచి బరిలో నిలవడం గర్వంగా ఉందన్నారు. అంతకుముందు రంగాయపల్లి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పటాన్‌చెరుకు చెందిన ఓ అభిమాని స్కేటింగ్‌ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణారెడ్డి, విఠల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, ఆంక్షారెడ్డి, నాగరాజుగౌడ్‌, భానుయాదవ్‌ పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నీలం మధు ఆధ్వర్యంలో ముప్పిరెడ్డిపల్లి భారాస సీనియర్‌ నాయకుడు పెంటయ్య, బిక్షపతి, చంద్రయ్యతోపాటు పలువురు పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌చారి, మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

 ‘రూ.2 లక్షల రుణమాఫీ తథ్యం’

 బ్బాక: భారాస హయాంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 15 లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల మాఫీని ఒకే విడతలో అమలు చేసి తీరుతామని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌కు మద్ధతుగా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్‌ వద్ద నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు హబ్షీపూర్‌ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణంలోని పుర వీధుల గుండా కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు