logo

ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?

ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షో, కొత్త బస్టాండ్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు.

Updated : 08 May 2024 05:58 IST

భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

 రోడ్‌షోలో ప్రసంగిస్తున్న అన్నామలై, పక్కన రఘునందన్‌రావు, గోదావరి, నాయకులు

సంగారెడ్డి అర్బన్‌: ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షో, కొత్త బస్టాండ్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న గ్యారంటీ కూడా లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామ మందిరం తొలగిస్తారా? త్రిపుల్‌ తలాక్‌తోపాటు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తారా అన్ని ప్రశ్నిస్తూ, వాటిపై సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్‌ చేశారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.  మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో మైనార్టీకి చెందిన అబ్దుల్‌ కలాంను, ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ  హయాంలో ఎస్సీ వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాకే దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటి మాత్రమే అమలవుతోందని,  మిగిలిన వాటిని అమలు చేయలేేదని అన్నామలై విమర్శించారు. మహిళలకు ఇస్తామన్నా రూ.2,500, గ్యాస్‌ సిలిండర్‌ రూ.500, రైతు కూలీలకు రూ.12 వేలు, రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు, పింఛన్‌ దారులకు రూ.4 వేలు ఇవ్వకుండా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు,  జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, భాజపా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు