logo

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర

రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ  సీఎం కేసీఆర్‌, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

Published : 09 May 2024 01:09 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి

హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం, కోహెడ, బెజ్జంకి, కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ  సీఎం కేసీఆర్‌, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్‌లోని ఒక వేడుక మందిరంలో జరిగిన రెడ్డి కుల బాంధవుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ఐక్యంగా ఉండాలన్నారు. నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్‌లో రెడ్డి అసోసియేన్‌ భవనాన్ని రూ.కోటితో నిర్మించుకోవచ్చన్నారు. ఇప్పటికే రూ.45 లక్షల నిధుల ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. సమావేశానికి రుణ విముక్తి కమిషన్‌ మాజీ సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి, నాయకులు హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటును హర్షిస్తూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఘనంగా జన్మదిన వేడుకలు: హుస్నాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రి కోసి అందరికి పంపిణీ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు బోకెలు, చిత్రపటాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు. అంతకుముందు స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వరస్వామిని దర్శించుకొని మంత్రి ప్రభాకర్‌ పూజలు నిర్వహించారు. పందిల్ల, కోహెడ, బెజ్జంకి మండలాల్లో నాయకులు పొన్నం జన్మదిన వేడుకలు నిర్వహించారు. హౌజ్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సహకార సంఘం ఛైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, డీసీసీ కార్యదర్శి చిత్తారి రవీందర్‌, పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్‌, కోహెడ మండలాధ్యక్షుడు ధర్మయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు