logo

పోచంపల్లి అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

దేశం నుంచి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికై ప్రపంచ వ్యాప్తంగా భూదాన్‌పోచంపల్లికి గుర్తింపు లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పోచంపల్లిని అన్ని విధాలుగా

Published : 05 Dec 2021 03:19 IST


భూదాన్‌పోచంపల్లి: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: దేశం నుంచి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికై ప్రపంచ వ్యాప్తంగా భూదాన్‌పోచంపల్లికి గుర్తింపు లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పోచంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పురపాలిక కేంద్రంలోని గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని శనివారం అయన సందర్శించారు. చేనేత కళలకు పుట్టినిల్లుగా, భూదానోద్యమానికి నాంది పలికిన ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. పర్యాటక గ్రామంగా ఎంపికడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతితో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రాక రద్దయిందని చెప్పారు. అనంతరం రాంలింగంపల్లి గ్రామంలో ఆకస్మికంగా మృతిచెందిన మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో పురపాలిక అధ్యక్షురాలు చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌ బాత్క లింగస్వామి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

చెరువు కట్ట తనిఖీ.. భువనగిరి: భువనగిరి చెరువు కట్టను ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చెరువు కట్ట దగ్గర ఉన్న గుట్టను సొంత నిధులతో తొలగించి చదును చేసి కట్టను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని హెచ్‌ఎండీఏ అధికారులను కోరుతామన్నారు. ఎమ్మెల్యే వెంట పుర అధ్యక్షుడు ఎనబోయిన ఆంజనేయులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని