logo

మృతదేహాలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకెళ్లా

ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్‌

Published : 26 May 2022 02:23 IST

అన్వితారెడ్డి, ఆమె తల్లిదండ్రులను సన్మానిస్తున్న అన్వితా సంస్థ ప్రతినిధులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం, దారిలో ఎన్నో మృతదేహాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా అడుగు ముందుకు వేయడంతోనే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్‌లతో జరిగిన కార్యక్రమంలో అన్వితారెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు మధుసూన్‌రెడ్డి, చంద్రకళను అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు బొప్పన ఆధ్వర్యంలో పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మే 12న ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ చేరుకున్న అన్వితారెడ్డి వివిధ ఎత్తుల్లోని నాలుగు శిబిరాలను దాటి తన గైడ్‌తో కలిసి 15వ తేదీన రాత్రి సమయంలో క్యాంప్‌-4 నుంచి బయలుదేరిందన్నారు. మే 16న ఉదయం 9.30 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుందన్నారు. ఎంబీఏ పట్టభద్రురాలైన అన్వితారెడ్డి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని అని, తండ్రి మధుసూదన్‌రెడ్డి వ్యవసాయదారుడని అచ్యుతరావు తెలిపారు. భువనగిరిలోని రాక్‌ క్లింబింగ్‌ పాఠశాలకు చెందిన కోచ్‌ శేఖర్‌బాబు శిక్షణ, అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు సహకారం విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని