logo

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

విద్యుత్తు నియంత్రికను బందు చేసే క్రమంలో ఓ రైతు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.గ్రామస్థులు,

Published : 26 Sep 2022 04:24 IST

నిడమనూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు నియంత్రికను బందు చేసే క్రమంలో ఓ రైతు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. కొట్టె మల్లయ్య(48) గ్రామంలోని తన బత్తాయితోట వద్దకు ఉదయం వెళ్లారు. తోటలోని  నియంత్రిక ఫ్యూజ్ పోవడంతో వేయడానికి దానిని బందు చేసేందుకు ఆన్‌ఆఫ్‌ స్టాండును పట్టుకున్నారు. దానికి విద్యుత్తు ప్రసరణ ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలారు. అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ‘నేను బతికుండగానే, నాకన్న ముందే నువ్వే చనిపోయావా కొడుకా’ అంటూ మృతుడి తల్లి లింగమ్మ రోదించడంతో స్థానికులు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని