logo

మునుగోడులో క్షణాల్లో ఉద్రిక్తత

దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానితుల జాబితాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ద్వారా పేరు వెలుగుచూసిన కవితపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మునుగోడులో భాజపా, బీజేవైఎం నాయకుల ఆందోళన క్షణాల్లో ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 02 Dec 2022 03:25 IST

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో రోడ్డుపై పరుగులు తీసిన బీజేవైఎం నాయకులు

మునుగోడులో కేటీఆర్‌ కాన్వాయ్‌ వచ్చే సమయంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నిస్తున్న బీజేవైఎం నాయకుడిపై లాఠీఛార్జీ చేస్తున్న పోలీసులు

మునుగోడు, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానితుల జాబితాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ద్వారా పేరు వెలుగుచూసిన కవితపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మునుగోడులో భాజపా, బీజేవైఎం నాయకుల ఆందోళన క్షణాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం మునుగోడులో సమీక్ష సమావేశానికి మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ వచ్చే సమయంలో బీజేవైఎం, భాజపా నాయకులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అందులో భాగంగానే దిష్టిబొమ్మకు మంట పెట్టి ద్విచక్ర వాహనంపై వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్డుపైకి చేరుకున్నారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని పక్కకు నెట్టేశారు. నాయకుల చేతిలో ఉన్న దిష్టిబొమ్మను లాగేసుకొని పక్కన పడేేశారు. మళ్లీ అదే దిష్టిబొమ్మను మరో కార్యకర్త తీసుకొని చౌరస్తాలో పరుగులు తీశారు. ఆ సమయంలో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేశారు. ఆ నాయకులందరినీ వెంటనే పోలీసు వాహనంలో మునుగోడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గొడవ జరిగిన చౌరస్తాకు కేటీఆర్‌ చేరుకునే సందర్భంలోనే ఈ గందరగోళం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని