logo

తెరాస తొలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా.?

తెరాస ఆవిర్భావం తరువాత జరిగిన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి తెరాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది డాక్టర్‌ కుడుదల నగేష్‌.

Published : 05 Nov 2023 08:47 IST

కుడుదల నగేష్‌

తెరాస ఆవిర్భావం తరువాత జరిగిన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి తెరాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది డాక్టర్‌ కుడుదల నగేష్‌. కాంగ్రెస్‌, వామపక్షాల పొత్తుతో ఆయన ఆలేరు (ఎస్సీ) స్థానం నుంచి బరిలో దిగి తెదేపా అభ్యర్థి అప్పటికే ఐదు సార్లు విజయాన్ని సొంతం చేసుకుని నియోజకవర్గంపై గట్టిపట్టున్న తెదేపా అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుపై ఘన విజయం సాధించారు. జిల్లాలో ఇతర చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందలేదు. డాక్టర్‌ నగేష్‌ 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 1999లో తెదేపా అభ్యర్థిగా మోత్కుపల్లి నర్సింహులుపై పోటీ చేసినా గెలుపును అందుకోలేకపోయారు. చివరగా తెరాస రాష్ట్ర స్థాయి ఊపులో నర్సింహులును 24,825 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. భువనగిరి నుంచి పోటీ చేసిన తెరాస అగ్రనేతల్లో ఒకరైన ఆలె నరేంద్రకు మాజీ మంత్రి తెదేపా అభ్యర్థి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి షాక్‌ ఇచ్చారు. ఆమె చేతిలో 17,536 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కానీ మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి నరేంద్ర గెలుపొందారు.

  • 2009 ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన తెరాసకు జిల్లాలో ఒక్క స్థానం కూడా దక్కలేదు.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఐదు స్థానాల్లో తెరాస అభ్యర్థులు గెలిచారు. ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, మునుగోడు, తుంగతుర్తి స్థానాలను తెరాస కైవసం చేసుకుంది.
  • 2018 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తొమ్మిందిటిని పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు మూడు స్థానాల్లో విజయం సాధించింది.

న్యూస్‌టుడే, భువనగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని