logo

yyy: భాజపాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు: కేసీఆర్

తెలంగాణకు అన్ని విధాల నష్టం చేసిన భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు..

Published : 25 Apr 2024 22:51 IST

భువనగిరి: తెలంగాణకు అన్ని విధాల నష్టం చేసిన భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. గత 10 ఏళ్ల కేంద్రంలోని భాజపా పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని ఆయన విమర్శించారు. ఒక నవోదయ పాఠశాల మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, తాను ఈ విషయమై 50 సార్లు కేంద్రాన్ని కలిసి అడిగానని వివరించారు. 150 సార్లు లెటర్లు రాసినా స్పందన లేదని, అలాంటి పార్టీకి ఓట్లు వేయలా అని ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. పేదరికం రెట్టింపు అయిందని, కనీసం డాలర్ విలువ కనిష్ఠ స్థాయిలో 80 రూపాయలకు పడిపోయిందని అన్నారు. ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని వాపోయారు. అంతకుముందు ఆయన గులాబీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకాయి. రోడ్ షో విజయవంతంగా సాగింది. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీత మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని