logo

సూర్యాపేట జయ విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మహాత్మాజ్యోతిభా ఫులే వెనకబడిన తరగతుల గురుకులాల్లో 99.69శాతం ఫలితాలు సాధించారు.

Published : 01 May 2024 06:10 IST

మహాత్మాగాంధీ రోడ్డు (సూర్యాపేట), న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జయ పాఠశాలకు చెందిన 386 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వారిలో 73 మంది విద్యార్థులు 10 జీపీఏ, 64 మంది 9.8, 57 మంది 9.7, 46 మంది 9.5 జీపీఏ, 333 మంది 9 జీపీఏలకు పైగా సాధించారని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌ తెలిపారు. పది ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మంగళవారం ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఫలితాల్లో తమ పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


మెరిసిన గురుకులాలు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మహాత్మాజ్యోతిభా ఫులే వెనకబడిన తరగతుల గురుకులాల్లో 99.69శాతం ఫలితాలు సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 51 మందికి 10 జీపీఏ వచ్చింది. నల్గొండ జిల్లాలో 1056 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1055 మంది ఉత్తీర్ణత.. 37 మంది 10జీపీఏ సాధించారు. సూర్యాపేట జిల్లాలో 567 మంది పరీక్షకు హాజరుకాగా 565(99.65శాతం) మంది ఉత్తీర్ణత.. 13 మంది 10జీపీఏ సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 298 మంది పరీక్షకు హాజరుకాగా  295(98.99శాతం) మంది ఉత్తీర్ణత.. ఒకరు 10జీపీఏ సాధించారు. దీని పట్ల బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి ఎం.షకీనా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

గిరిజన గురుకులాల్లో.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని గిరిజన గురుకులాల్లో 98.87శాతం ఉత్తీర్ణత.. పది మంది 10 జీపీఏ సాధించారు. నల్గొండ జిల్లాలో 632 మంది పరీక్షకు హాజరుకాగా 628(99.37శాతం) మంది ఉత్తీర్ణత.. ఏడుగురు 10జీపీఏ సాధించారు. సూర్యాపేట జిల్లాలో 168 మంది హాజరుకాగా 143(97.02శాతం) మంది ఉత్తీర్ణత.. ఇద్దరు 10 జీపీఏ సాధించారు. రీజియన్‌ పరిధిలోని 10 గురుకులాల్లో 6 నూరుశాతం ఫలితాలు సాధించాయని గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి కె.లక్ష్మయ తెలిపారు.

సాంఘిక సంక్షేమంలో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నల్గొండ రీజియన్‌ పరిధిలో 99.45 శాతం ఉత్తీర్ణత.. మొత్తం 19 మంది 10జీపీఏ సాధించారు. నల్గొండ జిల్లాలో 837 మంది హాజరుకాగా 834 (99.64 శాతం) మంది ఉత్తీర్ణత.. ఏడుగురు 10జీపీఏ సాధించారు. సూర్యాపేట జిల్లాలో 608 మందికి 605(99.67శాతం) మంది ఉత్తీర్ణత.. 9 మంది 10జీపీఏ సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 543 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 537(98.90శాతం) మంది ఉత్తీర్ణత.. ముగ్గురు 10జీపీఏ సాధించారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ హెచ్‌.అరుణకుమారి అభినందించారు.


పది పరీక్షల్లో త్రివేణి- కృష్ణవేణి సత్తా

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. మొత్తం 71 మంది విద్యార్థులు 10 జీపీఏ, 9.8 జీపీఏపైన 149 మంది, 9.7 జీపీఏపైన 538 మంది సాధించినట్లు వివరించారు. ఖమ్మం నగరంలోని త్రివేణి-కృష్ణవేణి పాఠశాలకు సంబంధించి మొత్తం 216 మంది పరీక్షకు హాజరు కాగా 13 మంది 10 జీపీఏ తెచ్చుకున్నారన్నారు. 9.8పైన జీపీఏ సాధించిన వారు 25 మంది, 9.7 పైన 38 మంది, 9.5 పైన 52 మంది, 9.3 పైన 68 మంది, 9.2 పైన 95 మంది, 9 పైన జీపీఏ 114 మంది సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్‌తో పాటు త్రివేణి-కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్‌ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ పి.రాజేంద్రప్రసాద్‌, సీఆర్‌ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ స్వప్న, ముస్తాఫా, అశోక్‌ తదితరులు అభినందించారు.


శ్రీచైతన్య విజయకేతనం

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు ఖమ్మం శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య తెలిపారు. తమ విద్యా సంస్థల్లో చదివే వారిలో అత్యధికంగా 557 మంది 10 గ్రేడ్‌ పాయింట్లు, 1,147 మంది 9.8 జీపీఏకి పైగా సాధించినట్లు తెలిపారు. 1,702 మంది విద్యార్థులు 9.7 జీపీఏకిపైగా... సరాసరి 9 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. గణితంలో 3,845 మంది విద్యార్థులు, సైన్స్‌లో 4,099 మంది, సోషల్‌లో 4,351 మంది, లాంగ్వేజెస్‌లో 11,669 మంది 10 జీపీఏ సాధించారన్నారు. సబ్జెక్టుల వారీగా మొత్తం 10 జీపీఏ సాధించినవారు 14,253 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాల్లో ఖమ్మం జోన్‌లోని శ్రీచైతన్య స్కూల్స్‌ విద్యార్థులు 84 మంది, వరంగల్‌ జోన్‌లో 94 మంది, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జోన్‌లో 112 మంది, నిజామాబాద్‌, మెదక్‌ జోన్‌లో 98 మంది, మహబూబ్‌నగర్‌, నల్గొండ జోన్‌లో 147 మంది, వికారాబాద్‌ జోన్‌లో 22 మంది 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఛైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు అభినందించారు.


పదింతల ఆనందం

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నల్గొండలోని ఎంవీఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌కి చెందిన విద్యార్థులు పది ఫలితాల్లో ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులు సుశ్మిత, యశ్వంత్‌, సరస్వతి 10 జీపీఏ, 9.8..8 మంది, 9.7.. 14 మంది సాధించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్‌ కొలనుపాక రవికుమార్‌, కరస్పాండెంట్‌ గీతా, ప్రిన్సిపల్‌ రఘునందన్‌, అహ్మద్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని