logo

ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు

లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్‌ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు.

Published : 03 May 2024 02:10 IST

నల్గొండ కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్‌ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌(వీవీప్యాట్‌). ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు, ఫొటో, గుర్తు, సీరియల్‌ నంబర్‌ కనిపిస్తాయి. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్‌ నంబర్‌తో స్లిప్‌ ప్రింట్‌ అవుతుంది. దానికి అమర్చిన పారదర్శక తెర మీద పేపర్‌ కేవలం 7 సెకన్లు ఉంటుంది. ఓటు నమోదైనట్లు ధ్రువీకరించుకోవడానికి వీవీప్యాట్‌ ఉపకరిస్తుంది. ఈ వ్యవస్థతో ఓట్లను మార్చడానికి లేదా లెక్కలు తారుమారు చేయడానికి వీలు లేదు. రీకౌంటింగ్‌ అవసరమైతే మ్యానువల్‌గా ఓట్ల గణనను నిర్వహించే మార్గాన్ని చూపుతుంది. ఈవీఎం, వీవీప్యాట్‌తో పాటు కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెటింగ్‌ యూనిట్‌లు ఉంటాయి. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ అధికారి దగ్గర బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ ఓటు వేసే దగ్గర ఉంటాయి. పోలింగ్‌ అధికారి కంట్రోల్‌ యానిట్‌ను ఆక్టివేట్‌ చేస్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని