logo

అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్‌సభకు తాత్సారం

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది.

Published : 03 May 2024 02:18 IST

తగ్గుతున్న పోలింగ్‌తో అభ్యర్థుల్లో ఆందోళన

మిర్యాలగూడలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. తగ్గుతున్న పోలింగ్‌ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుండడంతో..  లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వివిధ పార్టీల వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఓటర్లలో చైతన్యం సన్నగిల్లుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లు అందరూ ముందుకు రావాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

పోలింగ్‌లో భారీ తేడా..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భారీ తేడా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఆలేరులో 91.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి 80.36 శాతానికి పోలింగ్‌ పడిపోయింది. తిరిగి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91.18 శాతం పోలింగ్‌ నమోదైంది. మునుగోడులో 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 91.30 శాతం, 92.47 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ రెండు ఎన్నికల మధ్యలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 78.02 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ తేడా నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని