logo

నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు.

Published : 05 May 2024 04:33 IST

కలెక్టరేట్‌లో సామాజిక మాధ్యమాల తనిఖీ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాల తనిఖీ కంట్రోల్‌ రూమ్‌ను శనివారం ఆయన సందర్శించి మాట్లాడారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులను విమర్శించే విధంగా పోస్టులు పెట్టొద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు చేసినట్లయితే గ్రూప్‌ అడ్మిన్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లయితే ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో అప్పారావు, ఏవో సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

మహాత్మాగాంధీ రోడ్డు (సూర్యాపేట): పట్టణంలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సులభతర కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వేయొచ్చని చెప్పారు. ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని