logo

యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు

Published : 07 May 2024 07:08 IST

శివారాధన చేస్తున్న పూజారి
యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు. మూలవరులను మేల్కొల్పి హారతినిచ్చి నిజాభిషేకం, తులసీ అర్చన, మహాముఖ మండపంలో అష్టోత్తరం, స్వర్ణ పుష్పార్చనలు చేపట్టారు. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని జరిపారు. గజవాహనంపై కల్యాణ మూర్తులను అలంకరించి సేవ పర్వాన్ని.. సాయంత్రం గరుడ వాహనంపై స్వామి, ముత్యాల పల్లకీపై అమ్మవార్లను మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి వేళ స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన.. అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతి వర్థిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో ప్రత్యేక అర్చన, శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. దర్బార్‌ సేవ పర్వంలో ఆలయ నిత్యాదాయాన్ని వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.23,32,660 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్‌ రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని