logo

24లోగా ఓటర్ల తుది జాబితా

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు.

Published : 19 Apr 2024 03:44 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదయ్యారని, ఈనెల 14తో నూతన ఓటు నమోదు గడువు ముగిసిందని తెలిపారు. ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6, ఓట్ల బదిలీ కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తులను పరిష్కరించి ఈనెల 24లోగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సంజనా సిన్హా, డీఆర్వో లవన్న, వైకాపా, తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, సీపీఎం  ప్రతినిధులు జి.నారాయణ, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రసూల్‌, శ్రీనివాస్‌, బాలసుధాకర్‌, అజయ్‌కుమార్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం, అధికారులు ఆషర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని