logo

సర్వేపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

‘అయిదేళ్ల వైకాపా పాలనలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... అరాచకాలు, అక్రమ కేసులు, దోపీˆడీ తప్ప చేసిన అభివృద్ధి శూన్యమ’ని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 05 May 2024 03:46 IST

న్యూస్‌టుడే, వెంకటాచలం

‘అయిదేళ్ల వైకాపా పాలనలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... అరాచకాలు, అక్రమ కేసులు, దోపీˆడీ తప్ప చేసిన అభివృద్ధి శూన్యమ’ని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. వైకాపా పాలనను అంతమొందించేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమి ముందుకు వెళుతుందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. ‘న్యూస్‌టుడే’తో శనివారం ఆయన మాట్లాడారు.

రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా

మేము ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అందజేసి పేదలకు అండగా నిలుస్తాం. గ్యాస్‌ సిలిండర్ల  పంపిణీతో  నియోజకవర్గంలో 70 వేల కుటుంబాల వరకు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం వైద్యం సామాన్యులకు భారంగా మారింది. పేదలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం.

50 ఏళ్లకే పింఛను

తెదేపా హయాం లోనే రూ.200 నుంచి రూ.2వేలకు పెంచాం. రూ.3వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ రూ.3 వేలు ఇచ్చేందుకు అయిదేళ్లు పట్టింది.  50 ఏళ్లకే పింఛన్‌ అమలు చేస్తాం. దివ్యాంగలకు రూ.6వేలు, కిడ్నీ బాధితులకు రూ.10వేలు అందిస్తాం.పెంచిన పింఛన్‌తో సుమారు 52 వేల మంది వరకు లబ్ధి పొందనున్నారు.

హజ్‌యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష

ముస్లిం మైనార్టీలకు పెద్దపీˆట వేస్తాం.. నూర్‌బాషాలకు రూ.100 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలందిస్తాం. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనంగా అందిస్తాం.  హజ్‌ యాత్రకు రూ.లక్షతో పాటు, మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇస్తాం. నియోజకవర్గంలోని 14 వేల ముస్లిం కుటుంబాలతో పాటు 300 మంది ఇమామ్‌లు, మౌజన్‌లు లబ్ధి పొందుతారు.

నిరుద్యోగ భృతి  రూ.3 వేలు

వైకాపా నాయకుల కారణంగా కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్‌ టెర్మినల్‌ పక్క రాష్ట్రానికి తరలిపోయింది. పది వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతో పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు రాయితీ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తాం. మూతపడిన నైపుణ్య కేంద్రాలు తెరిపిస్తాం. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం. నియోజకవర్గంలో ఏడు వేల మంది వరకు లబ్ధిపొందనున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. క్రీడా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం.

బండేపల్లి-డేగపూడి కాలువ పూర్తి చేస్తాం

డేగపూడి-బండేపల్లి కాలువ మనుబోలు మండల ప్రజలకు ఒక వరం. కాలువ నిర్మాణానికి తాను రూ.44 కోట్లు మంజూరు చేయించా.  మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కాలువ పనులు అడ్డుకున్నారు. కాలువ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరుస్తా. నాలుగేళ్లుగా సాగుతున్న...సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనులు కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. 

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహిళా సాధికారతకు పెద్దపీˆట వేస్తాం.ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటాం. మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు నియోజకవర్గంలోని 65 వేల మంది మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నియోజకవర్గంలో 1.80 లక్షల మంది,  లబ్ధి పొందనున్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షలు వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తాం.

ఒకటో తేదీనే వేతనాలు

ఉద్యోగులు, పెన్షనర్లను వైకాపా ప్రభుత్వం  ఇబ్బందులకు గురి చేసింది.  వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి తెచ్చింది  ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు, పింఛన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో ప్రభుత్వ, ఇతర ఉద్యోగులు సుమారు 4500 మంది  లబ్ధి పొందనున్నారు. 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.  రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం. బీసీˆలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీˆ, ఎసీˆ్స, ఎసీˆ్ట కార్పొరేషన్లను పునరుద్ధరిస్తాం. బీసీˆ రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీˆలకు 34 శాతం అవకాశాలు కల్పిస్తాం. ఆదరణ పథకం ద్వారా 22 వేల మంది కులవృత్తి దారులకు లబ్ధి చేకూరనుంది. 

రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు

రైతు సంక్షేమానికి పెద్ద పీˆట వేస్తాం. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందిస్తాం. రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు సరఫరాతోపాటు, రాయితీపై సోలార్‌ పంపు సెట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, 90శాతం రాయితీతో బిందుసేద్య పరికరాలు అందజేస్తాం. సుమారు 40 వేల మంది వరకు రైతులు లబ్ధి పొందనున్నారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేస్తాం.

స్థానికులకు ఉద్యోగావకాశాలు

కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. పోర్టు అనుబంధ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. పోర్టులో దినసరి కూలీలకు కనీస వేతనం అమలు చేయడం లేదు. వారికిచ్చే నగదులోనూ వైకాపా నాయకులు కమీషన్లు దండుకుంటున్నారు. వారికి న్యాయం చేయడంతో పాటు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం ఉండేలా కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని