logo

Inter: శుక్రవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Published : 23 May 2024 20:00 IST

కామారెడ్డి పట్టణం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 కేంద్రాల్లో 10511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వార్షిక పరీక్షల్లో ప్రథమ, ద్వితీయంలో జిల్లాకు 35వ స్థానం దక్కింది. పడిపోయిన ఫలితాలు ఈ సారి జరిగే పరీక్షల్లో మెరుగయ్యేందుకు అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 29 మంది ముఖ్య పర్యవేక్షకులు, 29 మంది విభాగ పర్యవేక్షకులు, 4 సిట్టింగ్ స్వ్కాడ్లు, ఆరుగురు ఫ్లయింగ్ స్వ్కాడ్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని