logo

పోగ్గాళ్లు..

లింగంపేట మండలంలోని పలు గ్రామాల శివారు ప్రాంతాలు జూదానికి అడ్డాగా మారుతున్నాయి. ఓ గ్రామ ప్రజాప్రతినిధి మెంగారం అడవుల్లో హుక్కా పీల్చుతూ పేకాటాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా అటవీ ప్రాంతాలు, పంట పొలాలను పేకాట స్థావరాలుగా మార్చుకుంటున్నారు. బృందంగా ఏర్పడి ఎవరికీ ఏరోజుకారోజు కొత్త స్థలాన్ని ఎంచుకుంటున్నారు. ఉదయం నుంచి చీకటి పడేవరకు పేకాట కొనసాగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో

Published : 22 Jan 2022 03:30 IST

మెంగారం అటవీ ప్రాంతంలో రూ.లక్షల్లో పత్తాలాట

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

లింగంపేట మండలంలోని పలు గ్రామాల శివారు ప్రాంతాలు జూదానికి అడ్డాగా మారుతున్నాయి. ఓ గ్రామ ప్రజాప్రతినిధి మెంగారం అడవుల్లో హుక్కా పీల్చుతూ పేకాటాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా అటవీ ప్రాంతాలు, పంట పొలాలను పేకాట స్థావరాలుగా మార్చుకుంటున్నారు. బృందంగా ఏర్పడి ఎవరికీ ఏరోజుకారోజు కొత్త స్థలాన్ని ఎంచుకుంటున్నారు. ఉదయం నుంచి చీకటి పడేవరకు పేకాట కొనసాగుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో జోరుగా   నడిపిస్తున్నారు.

రోజుకో చోటు
పేకాటతో వందలాది కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని ప్రభుత్వం నిషేధించింది. కొందరు వ్యసనపరులు రహస్యంగా శిబిరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో లింగంపేట మండలంలో జూదరుల సంఖ్య పెరుగుతోంది. వీరికి రాజకీయ నాయకులు, పోలీసుల అండదండలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెంగారం అటవీ ప్రాంతంలో తరచూ స్థావరాలను మారుస్తూ పేకాడేస్తున్నారు. ఈ దందాకు ఐదుగురు సభ్యులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వారే జూదరులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. అధిక వడ్డీలకు రుణాలిస్తూ అప్పటికప్పుడే వసూలు చేస్తున్నారు. అనేక మంది మధ్య తరగతి ప్రజలు ఇల్లూవాకిలి తాకట్టుపెట్టి జీవితాలు పాడుచేసుకుంటున్నారు.  

‘ఆటలు’ సాగనివ్వొద్దు
పేకాటను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసులను ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ఇటీవల జోనల్‌ బదిలీల కారణంగా పోలీసు అధికారులు పేకాట శిబిరాలపై దృష్టిసారించడం లేదు. దీన్ని గమనించిన జూదరులు జోరు ఆడేస్తున్నారు. గతంలో బిచ్కుంద, పిట్లం, రామారెడ్డితో పాటు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించిన సంఘటనలున్నాయి. ప్రస్తుతం ఇలాంటి చర్యలేవీ కనిపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని