logo

వసతులు కల్పించడం అభినందనీయం

జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవా సంస్థ భవనంపై పి.పి గంగారెడ్డి కుటుంబ సభ్యులు సమావేశ గది నిర్మించడంతో పాటు తగిన వసతులు కల్పించడం అభినందనీయమని నిజామాబాద్‌ జిల్లా పోర్టుపోలియో

Published : 23 Jan 2022 04:26 IST

పి.పి.గంగారెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లాజడ్జి కుంచాల సునీత, న్యాయమూర్తులు, న్యాయవాదులు

నిజామాబాద్‌ న్యాయవిభాగం న్యూస్‌టుడే: జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవా సంస్థ భవనంపై పి.పి గంగారెడ్డి కుటుంబ సభ్యులు సమావేశ గది నిర్మించడంతో పాటు తగిన వసతులు కల్పించడం అభినందనీయమని నిజామాబాద్‌ జిల్లా పోర్టుపోలియో హైకోర్టు జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కలిసి వర్చువల్‌ విధానంలో సమావేశ గదిని ప్రారంభించారు. జిల్లాజడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. న్యాయవాదుల సెమినార్లతో పాటు ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని జిల్లాజడ్జి ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మాదస్తు రాజారెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు యం.రాజేందర్‌రెడ్డి, అదనపు జిల్లాజడ్జీలు గౌతమ్‌ప్రసాద్‌, పంచాక్షరి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి విక్రమ్‌, సీనియర్‌ సివిల్‌జడ్జి కిరణ్మయి, మెజిస్ట్రేట్లు జి.పి.ఈగ గంగారెడ్డి, జిల్లా కోర్టు పి.పి.రవిరాజ్‌, అదనపు పి.పి.బంటు వసంత్‌, లాలన సంస్థ అధ్యక్షులు రాజారెడ్డి, డాక్టర్‌ తిరుపతిరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని