logo

రోడ్డెక్కిన రైతు కుటుంబం

తమ భూమి పట్టా రికార్డులు సరిచేయాలని కోరుతూ కర్షక కుటుంబం బుధవారం బోధన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. లాడ్‌మావంది శివారులోని సర్వే నంబరు 5/2ఆలో 2.39 ఎకరాలను 1978లో తమ బంధువుల

Published : 29 Sep 2022 03:21 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించిన రైతు జలోజీ

బోధన్‌, న్యూస్‌టుడే: తమ భూమి పట్టా రికార్డులు సరిచేయాలని కోరుతూ కర్షక కుటుంబం బుధవారం బోధన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. లాడ్‌మావంది శివారులోని సర్వే నంబరు 5/2ఆలో 2.39 ఎకరాలను 1978లో తమ బంధువుల నుంచి కొనుగోలు చేశామని బాధిత రైతు జలోజీ తెలిపారు. కొంత భాగాన్ని విక్రయించామన్నారు. మిగులు భూమి 1.19 కిగాను ధరణి రికార్డులో 1.6 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాపాసు పుస్తకం చేతిలో పెట్టారని, ఆ తరువాత ఆరు గుంటలు కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 19 గుంటల భూమిని తన పేరున చేయాలని కలెక్టర్‌ సహా ఇతర అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని