logo

బాలల ఆలోచనలు బాగు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రాథమిక స్థాయి నుంచే పట్టు అవసరం. పాఠశాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికితేనే భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది.

Published : 26 Nov 2022 05:08 IST

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం


ప్రయోగాలను తిలకిస్తున్న విద్యార్థులు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రాథమిక స్థాయి నుంచే పట్టు అవసరం. పాఠశాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికితేనే భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది. కామారెడ్డిలో రెండు రోజులుగా జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతోంది. తాము రూపొందించిన అంశాలను విద్యార్థులు శుక్రవారం ఉత్సాహంగా ప్రదర్శించారు. శనివారంతో ప్రదర్శన ముగియనుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.


వివిధ రకాల పంటలు సాగు

* స్మార్ట్‌ ఫార్మింగ్‌

* అస్నావొద్దిన్‌, నబీవొద్దిన్‌

10   2  విద్యానికేతన్‌, పాతరాజంపేట

* వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో ప్రదర్శించారు. వాణిజ్య పంటలు, కూరగాయల సాగులో పాటించాల్సిన మెలకువలు వివరించారు. గడ్డి, వెదురుబద్దలు, ట్యాంకు, పైపులైన్లు తదితర పరికరాలను వినియోగించారు. దీనికి రూ.1,200 ఖర్చయిందని  విద్యార్థులు వెల్లడించారు.


అంధులకు సౌకర్యంగా

చూపులేని వారు సెన్సార్ల ద్వారా తాము వెళ్లాల్సిన బస్సు సమాచారం తెలుసుకోవడం.

 మనస్విని,  కారుణ్య 

8 2  ఎస్పీఆర్‌, కామారెడ్డి 

బస్టాండులోని ప్రతి ప్లాట్‌ఫాంకు సెన్సార్లు ఏర్పాటు చేశారు. చూపులేనివారు తాము  వెళ్లాల్సిన ప్లాట్‌ఫాం సమాచారం  తెలుసుకునేలా పరికరం తయారు చేశారు. ఈ ప్రదర్శనకు          రూ.వెయ్యి ఖర్చయిందని తెలిపారు.


స్వచ్ఛత.. ఆరోగ్యం

 పోషకాహారం తీసుకోవడంలో సూచనలు, శుభ్రతతో ఆరోగ్యం తదితర విషయాలను ప్రదర్శించారు.

రక్షిత, నాగచైతన్య   8 

జడ్పీహెచ్‌ఎస్‌(రామారెడ్డి)

ఆహారం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించేలా ప్రదర్శనలో చోటు కల్పించారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రయోగానికి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు  తదితర బొమ్మలను వినియోగించారు. రూ.1500 ఖర్చయిందని విద్యార్థులు వెల్లడించారు.


వ్యర్థాల పునర్వినియోగం

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇంధనం తయారీ   ఇమామొద్దిన్‌, వినయ్‌, వైష్ణవి   6వ

విద్యానికేతన్‌, కామారెడ్డి

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో యంత్రాల ద్వారా ఇంధనం తయారు చేసే   ప్రక్రియను విశదీకరించారు. దీనికి  ప్లాస్టిక్‌ ముక్కలు, సెన్సార్లు, డీజిల్‌, పెట్రోల్‌, ముడి నూనె డబ్బాలు  తదితర పరికరాలను వినియోగించారు. వ్యర్థాలను నిల్వ చేయకుండా పునర్వినియోగిస్తే సత్ఫలితాలు   సాధించవచ్చని చూపించారు.


ఓజోన్‌ పొర రక్షణ

కాలుష్యం కారణంగా ఓజోన్‌పొర దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై..  

సౌమ్య, సిరివెన్నెల

7 2  గురుకుల పాఠశాల,  తాడ్వాయి  

ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఓజోన్‌ పొర దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా గాలి కలుషితమవుతోంది. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రయోగంలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని