logo

చక్కదిద్దాల్సిందే

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు.. పిట్లం, మద్నూర్‌, బిచ్కుందలో పలు అభివృద్ధి పనులతోపాటు డోంగ్లీ మండలాన్ని ప్రారంభించేందుకు శనివారం వస్తున్నారు.

Published : 03 Dec 2022 03:41 IST

మొక్కుబడిగా సర్కారు వైద్యసేవలు
నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు.. పిట్లం, మద్నూర్‌, బిచ్కుందలో పలు అభివృద్ధి పనులతోపాటు డోంగ్లీ మండలాన్ని ప్రారంభించేందుకు శనివారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి రోగుల కన్నీరు తుడిస్తే పేదలకు ప్రయోజనం దక్కనుంది.

దృష్టి పెట్టాల్సిందే..

పేద, మధ్యతరగతి ప్రజల అత్యవసర వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. సరిహద్దు మండలమైన మద్నూర్‌ సామాజిక ఆరోగ్య ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులకు గాను ముగ్గురే ఉన్నారు. బిచ్కుందలో రూ.3 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యులను నియమించకపోవడంతో దవాఖానాలోని రూ.కోట్ల విలువైన పరికరాలు వృథాగా ఉంటున్నాయి.

అంతా ఫోనోలోనే..

నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రదర్శించే వైద్యుల జాబితాలో ఉన్నవారు ఫోన్‌ చేస్తే తప్ప రారని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోనే వివరాలు కనుక్కొని చికిత్స సూచిస్తారు.

ఈసారైనా పూర్తి చేయాలే..

పిట్లం ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో రోగులకు సేవలందని పరిస్థితి. కొత్త భవనం నిర్మాణానికి 2009లో శంకుస్థాపన చేసినప్పటికీ నిధులు మంజూరు కాక పనులు చేపట్టలేదు. తాజాగా మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తున్నారు. ఈసారైనా నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మద్నూర్‌లో పడకల దుస్థితి


ఏర్పాట్ల  పరిశీలన..

ఏఎంసీ సముదాయాల వద్ద నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హన్మంత్‌షిండే

పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమిపూజ, పిట్లం ఏఎంసీ నూతన దుకాణ సముదాయం ప్రారంభోత్సవానికి శనివారం మంత్రి హరీశ్‌రావు పిట్లం రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి, ఏఎంసీ దుకాణ సముదాయాల వద్ద ఏర్పాట్లను  ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పరిశీలించారు. వెంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ సాయిరెడ్డి, వైద్యులు శివకుమార్‌, రోహిత్‌కుమార్‌, నాయకులు విజయ్‌, వెంకట్రామ్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని