logo

పోలీసు పరిశీలకుడికి స్వాగతం

జహీరాబాద్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్‌ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు.

Published : 29 Apr 2024 05:00 IST

పోలీసు పరిశీలకుడు రాజేశ్‌ మీనాకు మొక్క అందజేస్తున్న ఎస్పీ సింధూశర్మ

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జహీరాబాద్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్‌ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. ఎస్పీ సింధూశర్మ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో రెండు అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలను, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు పాత నేరస్థులు, రౌడీషీట్‌ కలిగి ఉన్న 493 మందిని బైండోవర్‌ చేయడంతో పాటు లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి 19 ఆయుధాలను డిపాజిట్‌ చేయించామన్నారు. పోలీసు పరిశీలకుడిని కలిసిన వారిలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్‌రావు, పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామీణ సీఐ రామన్‌ తదితరులు ఉన్నారు.

పాలనాధికారి సైతం.. : కామారెడ్డి కలెక్టరేట్‌: జిల్లాకేంద్రానికి వచ్చిన జహీరాబాద్‌ లోక్‌సభ పోలీస్‌ పరిశీలకుడు రాజేశ్‌ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌ ఆదివారం స్వాగతం పలికారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు, వాహనాల తనిఖీలు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల పనితీరును ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని