logo

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో  జరిగింది. 

Published : 04 May 2024 13:39 IST

నాగిరెడ్డిపేట :  ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో  జరిగింది.  స్థానికులు తెలిపిన  వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భూమని రాములు (50) శనివారం ఉదయం జప్తి జనకంపల్లి గ్రామ శివారులోని మల్లాది చెరువులో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ప్రారంభించే సమయంలో  రాములు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల వద్ద రాములు మృతి చెందడంతో పలువురు ప్రజాప్రతినిధులు సంఘటన స్థలానికి  చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి  భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని