logo

‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’

కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 May 2024 06:09 IST

సాటాపూర్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

రెంజల్‌, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరోపించారు. సాటాపూర్‌లో సోమవారం నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేస్తున్న ప్రధాని మోదీ గత పదేళ్ల పాలనలో రైతులను విస్మరించారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ముగియగానే  రూ.2లక్షల రుణమాఫీ, పేదలకు పక్కా ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చి తీరుతుందన్నారు. కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బోధన్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు ఇప్పటికే రూ.43కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి స్వస్తి పలికి ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఏడాదికి 2 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదేళ్ల పాలనలో ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో ఇళ్లు కట్టుకున్నవారి బిల్లులు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నాయకులు మోబిన్‌ఖాన్‌, సాయారెడ్డి, జావిద్‌, గంగాకృష్ణ, ధనుంజయ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని