logo

‘యూనిఫాం సివిల్‌ కోడ్‌ తెచ్చి తీరుతాం’

తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

Updated : 07 May 2024 06:19 IST

గుండారంలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ గ్రామీణం, మోపాల్‌: తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మోపాల్‌, గుండారంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో పనులు చేసిందన్నారు. మాటిచ్చిన ప్రకారం పసుపు బోర్డును తీసుకొచ్చామన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించి దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి మోదీ అన్నారు. తన హయాంలో ఒక్క అవినీతి మచ్చ లేదన్నారు. కేవలం సేవా కార్యక్రమాల కోసమే రాజకీయాలు చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతే త్వరలో భాజపా సర్కారు వస్తుందని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌కులాచారి, అసెంబ్లీ కన్వీనర్‌ పద్మారెడ్డి, మండలాధ్యక్షులు జగన్‌రెడ్డి, రవికుమార్‌, శంకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

బోనస్‌ ఇవ్వని సీఎం రుణమాఫీ ఎలా చేస్తారు: ఎడపల్లి, న్యూస్‌టుడే : రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని ఎంపీ అర్వింద్‌ ప్రశ్నించారు. ఎడపల్లిలో సోమవారం సాయంత్రం ప్రచారం చేశారు. పదేళ్లు అన్ని వర్గాలను కేసీఆర్‌ మోసం చేశారని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి అదే చేస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల్లోనే బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, ఎంతకు అమ్ముతారో సీఎం చెబితే కొనుగోలు దారులను తీసుకొచ్చి తెరిపిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని