logo

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో, బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

Published : 08 May 2024 21:28 IST

కామారెడ్డి పట్టణం: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో, బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.  తమ స్వార్థ రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ. హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వడ్ల వెంకటస్వామి, కార్యదర్శి వంగ ప్రసాద్, బజరంగ్ దళ్ నాయకుడు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని