logo

వాయుగుండంగా మారిన అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలేశ్వర్‌కు తూర్పు, ఉత్తర దిశలో 70 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ విపత్తు

Updated : 15 Aug 2022 06:13 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (ఆదివారం ఐఎండీ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రం)

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలేశ్వర్‌కు తూర్పు, ఉత్తర దిశలో 70 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ విపత్తు పశ్చిమ, ఉత్తర పశ్చిమ దిశగా పశ్చిమ్‌ బంగ వైపు కదులుతున్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 45.55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. గోపాలపూర్‌, ధమ్రా, పరదీప్‌ ఓడరేవులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని, మత్స్యకారుల చేపల వేట సోమవారం నిషేధించినట్లు తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవగా, ఉత్తరకోస్తా, పశ్చిమ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడినట్లు చెప్పారు.

4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

జగత్సింగ్‌పూర్‌ జిల్లా ఎరసమలో అత్యధికంగా 215 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపిన దాస్‌ వాయుగుండం ప్రభావంతో సోమవారం నువాపడ, బొలంగీర్‌, కలహండి, సోన్‌పూర్‌ జిల్లాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామన్నారు. భద్రక్‌, బాలేశ్వర్‌, కటక్‌, కేంద్రపడ, పూరీ, జగత్సింగ్‌పూర్‌, ఖుర్దా, జాజ్‌పూర్‌, నయాగఢ్‌, గంజాం, గజపతి, కొంధమాల్‌, రాయగడ, కొరాపుట్‌, మల్కాన్‌గిరి, నవరంగపూర్‌, బౌద్ధ్‌, ఢెంకనాల్‌, మయూరభంజ్‌ జిల్లాలో 110 మిల్లీమీటర్ల వర్షాలు కురిసే సూచనలున్నందున ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశామన్న దాస్‌ మంగళవారం వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని