logo

భక్తిశ్రద్ధలతో మహర్నవమి పూజలు

గంజాం జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహర్నవమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Published : 05 Oct 2022 02:29 IST

మహిషాసురమర్ధిని అవతారంలో చౌడేశ్వరి అమ్మవారు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహర్నవమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి, మా నారాయణి, మా బాలకుమారి, సిద్ధ భైరవి, మొహురి కాళువ, సింఘాసిని, వ్యాఘ్రదేవి, మా బంకేశ్వరి తదితర శక్తిపీఠాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేసి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారిని ఉదయం మహిషాసురమర్ధిని అవతారంతో అలంకరించారు. ఖస్పావీధిలోని జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపం, జెమ్మి వీధిలోని స్వామి అయ్యప్ప ఆశ్రమం, ప్రేమనగర్‌ రెండోలైనులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం, డైమండ్‌ ట్యాంకు రోడ్డులో వీరబ్రహ్మేంద్ర స్వామీజీ మందిరంలోని కామాక్షి అమ్మవారు, నీలకంఠేశ్వరాలయం రోడ్డులో హరిహర భెట్‌ మందిరం సమీపాన స్వామి అయ్యప్ప మందిరాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజా మండపంలో మధ్యాహ్నం స్థానిక లలితా పారాయణం బృందం మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తల్లి సన్నిధిలో లలితా పారాయణం చేశారు.

చికిటి సమితిలోని శక్తిపీఠంలో మా బాలకుమారి అలంకరణ

ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళల సామూహిక కుంకుమార్చనలు

గాంధీనగర్‌లోని దుర్గాదేవి మండపంలో పారాయణ చేస్తున్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని