logo

జన్మభూమి రుణం తీర్చుకోవాలి: నవీన్‌

తమ ప్రభుత్వం ‘సమృద్ధ ఒడిశా’ ధ్యేయంగా కార్యక్రమాలు అమలు పరుస్తోందని, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 01:49 IST

నవీన్‌ నివాస్‌లో పిల్లలతో సీఎం ముచ్చట

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: తమ ప్రభుత్వం ‘సమృద్ధ ఒడిశా’ ధ్యేయంగా కార్యక్రమాలు అమలు పరుస్తోందని, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రజలకు ఆయన వీడియో సందేశమిచ్చారు. మనకెంతో ఇచ్చిన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి యువత ముందుకు రావాలని, అంకితభావంతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ఉన్నామని, మో సర్కార్‌, 5-టీ కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. కొవిడ్‌ ఆర్ధిక ప్రమాణాలను దెబ్బతీసినా, సమర్ధంగా ఎదుర్కోగలిగామని, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నవీన్‌ చెప్పారు.

పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు

కొవిడ్‌ వల్ల రెండేళ్లకుపైగా నవీన్‌ నివాస్‌కు ఎవరినీ అనుమతించలేదు. నవీన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహమ్మారి నియంత్రణలో ఉన్నందున ఆయన గణతంత్ర వేడుకల కోసం భువనేశ్వర్‌లోని పాఠశాలలకు చెందిన పిల్లల్ని ఆహ్వానించి వారితో ముచ్చటించి చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని