logo

కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘హెర్‌’ టీం

మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్‌, కటక్‌) కమిషనరేట్‌ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్‌ (హెరా) టీం ఏర్పాటు చేసింది.

Published : 19 Apr 2024 01:33 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్‌, కటక్‌) కమిషనరేట్‌ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్‌ (హెరా) టీం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భువనేశ్వర్‌కు ఏసీపీ అంజనా టుడు నాయకత్వంలో 14 మంది అధికారుల ప్రత్యేక బృందం సిద్ధమైంది. రాత్రి వేళలో ఇళ్లకు వస్తున్న ఉద్యోగినులు, విద్యార్థినులకు వేధింపులపై అందే ఫిర్యాదులపై చర్యలకు ఈ బృందం ఏర్పాటైనట్లు ఏసీపీ అంజనా గురువారం విలేకరులకు చెప్పారు. బాధితులు 102 లేదా 6372500400 నెంబర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు తీసుకుంటారని, ఫిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని