logo

రాయగడ జిల్లా కాంగ్రెస్‌లో అయోమయం

ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Updated : 05 May 2024 07:22 IST

బిజదకుమార్‌ గమాంగ్‌(జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు)

 దుర్గా ప్రసాద్‌ పండా(కొరాపుట్ లోకసభ నియోజకవర్గ పీˆసీˆసీˆ ఇన్‌ఛార్జ్జి)

గుణుపురం, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాయగడ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిజయకుమార్‌ గమాంగ్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో జిల్లాలోని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బిజయకుమార్‌ గమాంగ్‌కు జిల్లా కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించింది. మొదట పార్టీ కార్యక్రమాల్లో కొంత ఉత్సాహంగా కనిపించినా ప్రస్తుతం ఆయన జోరు తగ్గిందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్‌ కోసం బిజయగమాంగ్‌, ఆయన కుమారుడు అవినాష్‌ గమాంగ్‌లతోపాటు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అవినాష్‌ గమాంగ్‌కు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. గుణుపురంలో బిజయగమాంగ్‌ తమ్ముని కుమారుడు సత్యజిత్‌ గమాంగ్‌కు టికెట్‌ కేటాయించడంతో గమాంగ్‌ కొంత అసంతృప్తికి గురయ్యారు. అవినాష్‌ గమాంగ్‌, బిజయగమాంగ్‌ సతీమణితోపాటు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల రాయగడలో జరిగిన పార్టీ సమావేశానికి బిజయ్‌ హాజరు కాలేదు. కొరాపుట్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సప్తగిరి ఉలకా గుణుపురం సమితిలో పర్యటించినా ఈయన పాల్గొనలేదు. ఈ విషయమై బిజయ గమాంగ్‌ వివరణ ఇస్తూ తాను పార్టీకి దూరంగా లేనని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. తన కుమారుడి రాజీనామా విషయం వ్యక్తిగతమన్నారు.  పీసీసీ కార్యదర్శి, కొరాపుట్ లోకసభ ఇన్‌ఛార్జి దుర్గా ప్రసాద్‌ పండాతో మాట్లాడగా తాము ఎప్పుడూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునికి దూరంగా ఉంచాలని ప్రయత్నించలేదన్నారు. ఏఐసీసీ పరిశీలికుడు బిజయగమాంగ్‌ ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారని పండా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని