logo

ప్రచారం జోరు

సాధారణ ఎన్నికల పోలింగు తేదీ దగ్గరపడుతుండగా, బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచారం జోరును మరింత పెంచారు.

Published : 07 May 2024 01:17 IST

బిజద అభ్యర్థి డాక్టర్‌ చ్యవుపట్నాయక్‌కు మద్దతుగా మహిళల ప్రచారం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: సాధారణ ఎన్నికల పోలింగు తేదీ దగ్గరపడుతుండగా, బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచారం జోరును మరింత పెంచారు. బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌ సోమవారం వివిధ వార్డుల్లో మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్‌ (పింటు దాస్‌) ఎన్నికల సంఘం కేటాయించిన కుండ గుర్తుతో ప్రచారం ఉద్ధృతం చేశారు. సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిటింగ్‌ ఎమ్మెల్యే రమేష్‌ జెనా ఆదివారం ధారాకోట సమితిలో బలరామ్‌పూర్‌ పంచాయతీలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో సమావేశమయ్యారు. పొలసరా అసెంబ్లీ నియోజకవర్గం బిజద అభ్యర్థి శ్రీకాంత్‌ సాహు సోమవారం పొలసరా సమితిలో రుమాగడ పంచాయతీలోని వివిధ గ్రామాల్లో సాంస్కృతిక బృందాలతో ప్రచారం నిర్వహించారు.

సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలతో సమావేశమైన కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌ జెనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని