logo

బాలికపై సామూహిక అత్యాచారం: ఐదుగురి అరెస్టు

బ్రహ్మపుర బైద్యనాథపూర్‌ (బిఎన్‌.పూర్‌) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.

Published : 09 May 2024 04:19 IST

సార్థక్‌ షడంగి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర బైద్యనాథపూర్‌ (బిఎన్‌.పూర్‌) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బి.ఎన్‌.పూర్‌ ఠాణాలో ఈనెల 5న పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రుతున్‌ కుమార్‌ దాస్‌ (22)తోపాటు 19-26 ఏళ్ల వయసు గల మొత్తం అయిదుగురిని అరెస్టు చేసి బుధవారం న్యాయస్థానానికి తరలించినట్లు బ్రహ్మపుర ఎస్పీ బాధ్యతలో ఉన్న డీఐజీ సార్థక్‌ షడంగి చెప్పారు. మధ్యాహ్నం బ్రహ్మపుర ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు.

నమ్మించి.. గదికి తీసుకువెళ్లి..

ప్రైవేటు విద్యాసంస్థలో ప్లస్‌టు చదువుతున్న బాలిక ఈ నెల 3న స్నేహితురాలిని కలిసేందుకు స్థానిక హిల్‌పట్నాలోని ఆమె ఇంటికి వచ్చింది. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత బాలిక ఇంటికి బయలుదేరేందుకు తండ్రికి ఫోను చేసి హిల్‌పట్నా రోడ్డులో నిరీక్షించింది. అదే సమయంలో అటుగా వచ్చిన రుతున్‌ దాస్‌ బాలికను చూశాడు. వీరిద్దరికీ అంతకు ముందే ముఖ పరిచయడం ఉండడంతో కొత్తబస్టాండు ప్రాంతంలోని తన ఇంటికి వెళదామని, అక్కడి నుంచి ఇంటివారికి ఫోను చేస్తే, వారు వచ్చి తీసుకెళతారని నమ్మించాడు. తన ద్విచక్ర వాహనంపై కొత్త బస్టాండు ప్రాంతంలో ఉంటున్న గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఉండడం ఇష్టం లేని బాలిక ఇంటికి వెళ్లిపోతానని చెప్పడంతో అమ్మను పిలుచుకువస్తానని, ఈలోగా శీతల పానీయం తాగమని (అప్పటికే అందులో మత్తు పదార్థం కలిపారు) బాలికను ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది. దీంతో రుతున్‌తోపాటు ఆయన స్నేహితులు మరో నలుగురు ఆమెపై అత్యాచారం చేశారు. మత్తు వల్ల బాలిక ప్రతిఘటించలేకపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు స్పృహ రావడంతో ఆమెను బెజ్జిపురం సంతోషిమాత మందిర ప్రాంతంలో వదిలి, విషయం ఎవరికైనా చెబితే హతమారుస్తామని రుతున్‌ బెదిరించాడు. రెండు రోజుల తర్వాత ఈ నెల 5న బాధితురాలు బి.ఎన్‌.పూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఐదుగురు యువకుల్ని అరెస్టు చేశామని, నిందితులు, బాలికకు వైద్య పరీక్షలు చేయించామని డీఐజీ షడంగి తెలిపారు. ఈ ఘటనలో ఇంకెందరి ప్రమేయముంది? ఇతరత్రా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని