వస్తున్నాయ్.. పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు (34 మండలాలు ప్రాతిపదికన) సంబంధించి మొదటి సెమిస్టర్‌లో సుమారు 13.18 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరాయి.
ఉమ్మడి జిల్లాకు 13.18 లక్షలు సరఫరా
మన్యం జిల్లా ఘటనతో విద్యాశాఖలో కదలిక
న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరుకుంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు (34 మండలాలు ప్రాతిపదికన) సంబంధించి మొదటి సెమిస్టర్‌లో సుమారు 13.18 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరాయి. పాఠశాలలు తెరిచే లోపు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాల సరఫరా విషయంలో పార్వతీపురం మన్యం జిల్లా ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో విద్యాశాఖలో కదలిక తీసుకొచ్చింది.
గతేడాది పరిస్థితి..
2022-23 విద్యా సంవత్సరంలో మే నుంచి ఫిబ్రవరి వరకూ పుస్తకాలు సరఫరా చేశారు. ఎనిమిదో తరగతి సిలబస్ మార్పు చేయడంతో పుస్తకాలు ఆలస్యంగా వచ్చాయి. 9, 10 మినహాయిస్తే ఇతర తరగతులకు మూడు సెమిస్టర్లుగా పుస్తకాలు అందించాలి. షెడ్యూల్ ప్రకారం పుస్తకాలు రాకపోవడంతో కొద్దిరోజులు విద్యార్థులు తరగతి గదిలో బోధనకే పరిమితం కావాల్సి వచ్చింది. చాలా మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ విద్యలో ప్రవేశాలు పొందడంతో కొన్ని సబ్జెక్టుల్లో పుస్తకాల కొరతతో ఎంఈవోల ద్వారా ఇండెంట్ మేరకు తెప్పించి ఇవ్వడంతో జాప్యం చోటుచేసుకుంది.
జరిగింది ఇదీ..
విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత నెల మన్యం జిల్లాలోని పాఠశాలలను సందర్శించారు. వీరఘట్టం కేజీబీవీకి గణితం రెండో సెమిస్టర్ పుస్తకాలు అందించకపోవడాన్ని గుర్తించారు. పాలకొండ మండలం కొండాపురంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన ఆయన నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్ ఖాళీగా ఉండడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో వీరికి మద్దతుగా ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోతే పిల్లలు ఎలా చదువుతారు? ఇవ్వడం అధికారుల బాధ్యత కాదా..? అంటూ ప్రశ్నించారు. రానున్న ఏడాది జూన్‌లోనే పుస్తకాలిస్తామని చెప్పారు.
ప్రైవేటు మాటేమిటో..?
గతేడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది. పాఠశాలలు తెరిచే వరకు యాజమాన్యాలు ఇండెంట్ పెట్టకపోవడంతో పుస్తకాలు కొంత ఆలస్యమయ్యాయి. విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం ముందుగానే డబ్బులు వసూలు చేయడంతో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వమే సరఫరా చేస్తుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక రెండు సెమిస్టర్లే..
ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు సెమిస్టర్లుగా ఉన్నవి రెండుగా రూపొందించారు. 1-8 తరగతుల పుస్తకాల్లో తెలుగు, ఆంగ్లం రెండు మాధ్యమాలు ఉండేలా గతేడాదే ముద్రించారు.ఈ ఏడాది తొమ్మిదో తరగతి పుస్తకాల్లో రెండు మాధ్యమాలు పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు.పదో తరగతి పుస్తకాలు పాత విధానంలో రెండు మాధ్యమాలు వేర్వేరుగా ఉంటాయి.
జేవీకే పాయింట్లకు తరలించాం..
- ఉమారాణి, ప్రబంధకురాలు, పాఠ్యపుస్తక విభాగం కేంద్రం, విజయనగరం జిల్లా
ఈ ఏడాది విద్యాశాఖ ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రవేశాలు పెరిగితే అయిదుశాతం బఫర్ స్టాక్ కింద పుస్తకాలు ఉంటాయి. డీఈవో అనుమతితో వీటి నుంచి అందజేస్తాం. జిల్లాలకు వచ్చిన పుస్తకాల్లో ఒక విడత జగనన్న విద్యా కానుక (జేవీకే) పాయింట్ల వద్దకు తరలించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్
-
Movies News
Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి
-
India News
20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్‌కు ప్రమాదం.. రెండు ఒడిశాలోనే!
-
Sports News
David Warner: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. అదే ఆఖరు సిరీస్
-
India News
PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
-
General News
Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. 316మంది ఏపీ వాసులు సేఫ్, 141మంది ఫోన్లు స్విచ్ఛాఫ్