తక్కువ ధరకు ఇళ్ల నిర్మాణ సామగ్రి
జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తక్కువ ధరకు రాయితీపై ప్రభుత్వం అందిస్తోందని కలెక్టరు నిశాంత్‌కుమార్ తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టరు నిశాంత్‌కుమార్
పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తక్కువ ధరకు రాయితీపై ప్రభుత్వం అందిస్తోందని కలెక్టరు నిశాంత్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణం, అమృత్ సరోవర్, ఉపాధి హామీ పథకాలపై ఆయన సమీక్షించారు. లబ్ధిదారులకు సిమెంటు, ఇనుము, శానిటరీ సామగ్రి వంటివి తక్కువ ధరకు ప్రభుత్వం అందిస్తోందని, తద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందన్నారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో పరిష్కారాలు సంతృప్తికరంగా ఉండాలని, అపరిష్కృతంగా ఉన్నవి శనివారానికి పరిష్కరించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సంభాషణను దృశ్యీకరించాలని ఆదేశించారు. పరిష్కారం చూపిన అర్జీలకు సంబంధించి ప్రతి మండలం నుంచి రెండు కేస్ స్టడీలను తనకు పంపించాలన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీల వారీగా కాకుండా శివారు గ్రామాల వారీగా ఉపాధి హామీ పనులు కేటాయించాలన్నారు. ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో వెంకటరావు, డ్వామా పీడీ రామచంద్రరావు, డీజీపీవో సత్యనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ