logo

జనసేనలోకి చేరికలు

అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.

Published : 05 May 2024 05:33 IST

దిమ్మిడిజోలలో సర్పంచి రజినికి కండువా వేసి ఆహ్వానిస్తున్న జయకృష్ణ, నాయకులు
భామిని, న్యూస్‌టుడే: అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం భామిని మండలం దిమ్మిడిజోలలో ప్రచారం చేశారు. దిమ్మిడిజోల సర్పంచి దంపతులు వలురౌతు రజిని, రామారావుతో పాటు 57 మందికి జయకృష్ణ, కూటమి నాయకులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మణిగ పంచాయతీ సర్పంచి దంపతులు కొండగొర్రి మంగమ్మ, చంటిబాబుతో పాటు 27 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతగిరి, పోలవరం, లోవగూడ, బాలేరు, మనుమకొండలో 70 మంది వైకాపాను వీడి జనసేనలోకి వచ్చారు. అనంతరం వీధుల్లో నాయకులు పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కోరారు. జనసేన ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు, నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్‌, కన్వీనర్‌ నిమ్మల నిబ్రం, తెదేపా మండల అధ్యక్షుడు బి.రవినాయుడు, కార్యదర్శి ఎం.జగదీశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని