logo

నాగభైరవ సాహితీ పురస్కారాల ప్రదానం

నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాల ప్రదానోత్సవం... ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళారత్న భూసరపల్లి

Published : 29 Aug 2022 02:14 IST

పురస్కార గ్రహీతలను సత్కరిస్తున్న సాహిత్య పీఠం ప్రతినిధులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాల ప్రదానోత్సవం... ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళారత్న భూసరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా సాహితీ చరిత్రలో నాగభైరవ కోటేశ్వరరావు స్థానం సుస్థిరమైనదన్నారు. ఎందరో సాహితీవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. పురస్కారాలకు నిర్వహించిన పోటీల్లో ఎంపికైన పారుపల్లి కోదండరామయ్య (హైదరాబాద్‌) రచించిన ‘తెలుగే గొప్ప భాష’ (ప్రథమ); గుమ్మా సాంబశివరావు (విజయవాడ) రచించిన ‘అన్నమయ్య పద కవితా పరామర్శ’ (ద్వితీయ) గురించి వివరించారు. ఆత్మీయ పురస్కార గ్రహీత నూనె అంకమ్మరావు, కళా పురస్కార గ్రహీత నాయుడు గోపీ (గుంటూరు జిల్లా పెదకాకాని)ని సత్కరించారు. కార్యక్రమంలో వైద్యులు కందిమళ్ల సాంబశివరావు, టి.అరుణ, నాగభైరవ ఆదినారాయణ, సింహాద్రి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని